పోరాటం
పోరాటం
ఓడిపోతే మళ్ళీ పోరాడు.
ఒప్పుకోకు నీ ఓటమిని.
ఎదురోడ్డి నిలబడు.
ఆయుధమై కలబాడు.
ఎన్ని అవరోధాలు సృష్టించిన దాటుకొని.
ఎన్ని కుట్రలు పన్నినా.
పెను తుపాను ప్రళయలతో విజృంభించిన
ఆదరకు బెధరకు.
నీగెలవాలనే సంకల్పం ముందు అన్ని దిగాదూడుపే.
భయాన్ని వదిలి ధైర్యంగా పోరాడు.
నీపోరాటం ఎగసిపడే తుపానవ్వాలి.
పొగ్గొటాలి నీలో భయాన్ని
నింపాలి నీలో ఆత్మవిశ్వాసాన్ని.
నిన్ను చూసి విజయం దాసోహమవ్వాలి.
ప్రపంచానికి తెలియాలి నీ గెలుపు.
పట్టుబట్టిన ఈవిజయం చరిత్రలో నిలచిపోవాలి.
సాగిపోవాలి నీప్రయాణం ఇంతకు ఇంతై.
ఆగిపోకూడదు ఇక్కడే ఎవరెస్ట్ శిఖరమంతా ఎత్తుకు
ఎదగాలి.
