STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మధ్యతరగతి జీవితాలు

మధ్యతరగతి జీవితాలు

1 min
1



మధ్యతరగతి జీవితమంటే నిత్యం పరుగు పందెం రా..
అందని ఆశల అంచుల్లో అప్పుల వడ్డీల దాగుడుమూత
పైకి నవ్వుతూ లోలోపల బాధ్యత బరువెత్తు బ్రతుకు రా..
ఎవరు చూసినా మామూలే.. మా బ్రతుకంతా మలుపులే!

ఆదాయం మా చేతిలో అది ఆవిరైపోతుందే ఆఖరుకే
ఈఎమ్‌ఐ బండి చక్రంలా తిరుగుతుంటే తెల్లారేదాకా..
పిల్లల చదువులు ఇంటి అద్దె ప్రతి నెల ఒక యుద్ధమే
చిరిగిన చొక్కాని మడత పెట్టి కొత్త బట్టలనటిస్తాం
మా కష్టాలు లోకానికి తెలియవులే.. సర్దుకుపోవడమే మా సిద్ధాంతంలే!

భూతద్దంలో కష్టం చూసి మమ్మల్ని మేమే ఓదార్చుకుంటాం
ధనికుడి కలలు కల్లలైనా పేదోడి కన్నీళ్లు మావి కావు
సంస్కారం మా ఇంధనం.. సహనం మాకు శ్రీరామరక్ష
రేపటిపై ఆశతో ఆశయం మా గుండెల్లో దాచుకుంటాం
లక్ష్యం చేరే మార్గం కష్టమో.. ఓటమి మాకెప్పుడూ ఇష్టం లేదు!

చిన్న సంతోషం దొరికినా పండగలా చేసుకుంటాం
బాల్యాన్ని బతికించుకుంటూ భవిష్యత్తు కోసం ఆరాటపడతాం
ఏసీ గదిలో కూర్చోకున్నా చెమటోర్చి చదివిస్తాం
తమ పిల్లలు బాగుంటే తమ బ్రతుకే చల్లనంటాం
పరువు కోసం పస్తులుంటాం.. ప్రపంచానికి కనిపించని వీరులం!


Rate this content
Log in

Similar telugu poem from Classics