STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Tragedy Inspirational

4  

VENKATALAKSHMI N

Abstract Tragedy Inspirational

పొగ లేని బతుకు

పొగ లేని బతుకు

1 min
284

ఏమిటో వెలుగు రేఖలు

నిటారుగా నిలబడి

ఆశల దారులకు బాటలు చూపిస్తుంటే

వ్యసనాల చట్రంలో చిక్కుకుని

బాటలను బీటలు వారుస్తున్నావు

తోలుతిత్తే కదాని అలుసుగా చూసి

డొక్కలకు పొగపాగా వేసి

నరకానికి నకళ్ళుగా మార్చుకున్నావు

మాయనంటి పెట్టుకుని జనించిన నీకు

కమ్ముకుంటున్న మాయాపొరలు కనబడవు

కనీస స్పృహను కోల్పోయిన నీకు

కనువిప్పు మాటలేల వినబడుతాయి

ఇకనైనా మేల్కోనలేదో

ఊపిరి కూడా బరువవుతుంది

ఉసురాడని నీకు పొగ లేని బతుకు విలువ

ఉన్నట్టుండి మనసును కదిలిస్తుంది

అర్దాయుష్షుతో తనువును చాలించక

అప్పుడైనా కొత్త పేజీని పునర్లిఖించుకో


Rate this content
Log in

Similar telugu poem from Abstract