STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

పంచభూతాలు

పంచభూతాలు

1 min
9


అనావృష్టిలో భూమాత ఎంత

తల్లడమల్లడమై పోతుందో

తన కురుల్లాంటి తరువులు

తరుక్కుపోతుంటే 

గొంతు తడారినంత దుఃఖం

నదీనదములు సెలయేళ్ళు

వట్టి పోయిన గోమాత పొదుగులైతే

వసుంధర వేదనను వినేవారేవరు


నరుని తలపులన్నీ రూకలకు లాకులెత్తుతుంటే

నా తల్లి అవని చనుబాలు ఇవ్వలేక

తన బిడ్డల కన్నీటిని ఓదార్చలేక

ఎంత మౌన వేదనో

వినే పాలకులకు తీరికేది


అడవి అమ్మలాంటిదే తన ఒడిలో

జనవాహినికి సేద తీర్చేను

మేఘాలకు వానమబ్బులనిచ్చి

సముద్రునితో సయోధ్య కుదిర్చేను


తన దేహ సౌందర్యానికి మూలం

తరువులు చెరువులు కొండ కోనలు

కోనేటి ఛాయల్లో అన్నీ జలకళశాలే

కాపాడుకుంటే కరువుబాపే తావులు


ఈ భూమొక సుగంధ మట్టివేళ్ళ

అక్షయ పాత్ర

పసిపాపలా కంటిపాపోలే చూసుకుంటే

నేలమ్మ అడుగకనే వరాలనిచ్చే కార్తుల తల్లి

ఋతువులు గతులు తప్పాకే

భూగోళం మండుతున్న కుంపటైంది


 ఒక్కొక్కరు నెమలీకోలే భూతల్లికి

పూల కొమ్మై వింజామరలు వీస్తూ

వానమ్మకు ప్రకృతి పరంగా స్వాగతం పలుకుదాం

కాలుష్య కాటుకను తీసేసి

పంచభూతాలకు హారతి పడుదాం




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics