STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

పలుకని చిలుక..

పలుకని చిలుక..

1 min
403

బిడ్డ ఆకలి తెలిసిన తల్లిలా

ఆమె అక్కడే నిల్చుంది

అలసిన చిలుకను నిద్దుర లేపి 

పండ్లు తినిపించాలని ప్రయత్నం


గుర్తొచ్చిన బిడ్డ

చెమ్మగిల్లిన కళ్ళు

దినచర్యలో భాగమే ఇది


ప్రతి రోజూ చెప్పుకునే బాధలు

వింటుందా ఆ చిలుక

ఓ రోజు ఆమెకు అనిపించింది

స్వేచ్ఛను మించిన ఆనందం

ఆహారంలో ఇవ్వలేను అని


స్వార్థమా

సాయమా అని ఆలోచించి చూస్తే

పంజరం తెరవాలనిపించింది

ఇప్పుడిక తనని ఎవ్వరూ ఆపలేరు


తెరిచిన పంజరంలో నుంచి

బయటికి ఎగిరిన చిలుక

ఆమెకు ధన్యవాదాలు చెబుతూ

హితబోధ చేసినట్లు అనిపించింది


ఆమె ఒక అడుగు ముందు

కు వేసి

బయటికి చూసింది..


Rate this content
Log in

Similar telugu poem from Drama