STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics

4  

SATYA PAVAN GANDHAM

Classics

"పల్లె పిలుస్తుంది...రా...!"

"పల్లె పిలుస్తుంది...రా...!"

1 min
239

"పల్లె పిలుస్తుంది...రా...!"

పల్లె గాలికి ఊపిరోసుకున్న నువ్వు!

పట్టణపు కాలుష్యానికి ఆవిరవుతున్నావని...!!

నలుగురిలో ఊరేగే నువ్వు!

నాలుగు గోడల మధ్య ఊగిసలాడుతున్నావని...!!

"ఈ పల్లెకి తెలిసి నిను పిలుస్తుంది...రా...!"


సద్ధి కూడుతో సర్ధుకున్న నువ్వు!

సాలిసాలని కడుపుతో సతమతమవుతున్నావని...!!

అన్నదాత కడుపునుట్టిన నువ్వు!

ఆకలితో అలమటిస్తూ పొట్టసేతబట్టి అర్ధిస్తున్నావని...!!

"ఈ పల్లెకి తెలిసి నిను పిలుస్తుంది...రా...!"


సర్కారు బడుల్లో సదివిన నువ్వు!

ప్రయివేటు సంస్థాగతులకు బానిసయ్యావని...!!

మట్టి ఈదుల్లో మసిలిన నువ్వు!

పట్నపు దారుల్లో పరుగులెడుతున్నావని...!!

"ఈ పల్లెకి తెలిసి నిను పిలుస్తుంది...రా...!"


ప్రకృతి ప్రేమకు పరవశించిపోయే నువ్వు!

కృత్రిమ మేధకు నీరసించిపోతున్నావని...!!

అలసిన దేహాన్ని సైతం బరించగలిగిన నువ్వు!

నలిగిన మనసుతో విసుగుచెందుతున్నావని...!!

"ఈ పల్లెకి తెలిసి నిను పిలుస్తుంది...రా...!"


పల్లెకు నీ ఉపయోగం సంగతి దేవుడెరుక.. నీకాటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఆలపిస్తున్న ఆటి ఆర్తనాదాలు నీకినిపిస్తున్నాయా??


"దేశానికి పట్టుకొమ్మలైన ఈ పల్లెలే నేడు తెగిపడుతున్నా .."

మూగబోయిన గొంతుతో నీ పల్లె నిను మనసారా పిలుస్తుంది...రా...!"


✍️ సత్యపవన్✍️



Rate this content
Log in

Similar telugu poem from Classics