పిచ్చాపాటి...శ్రీనివాస భారతి
పిచ్చాపాటి...శ్రీనివాస భారతి


నలుగురూ
కూర్చొని
ఇంటినుండి
ప్రపంచందాకా
పిచ్చాపాటి
బాతాఖాని
ఏ పేరైతేనేం
చెట్టునీడ
అంతర్జాతీయ వేదిక
వాళ్లందరికీ ఒకనాడు....
ఊరంతా
కష్టసుఖాలు పంచుకొంటూ!
ఇప్పుడు మాత్రం
ముగ్గురే ఉన్న ఇల్లు
ఒకొక్కరిప్రపంచం.. ఒక్కోరకంగా
అందరూ
ఇంట్లోనే
ఎవరికి ఎవరో అన్నట్టు....
ఇదీ ప్రపంచం...
------00000000---------