Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

పెళ్ళి చూపులు

పెళ్ళి చూపులు

1 min
3

జరిగిన పెళ్ళిచూపు తంతుయందునా

ఎదురుగ విరాజిల్లె కాబోవువరుడు

నిశితపు చూపులతో కలవరపరచెను

చిరునగ వులతోడూ సమ్మతితెలిపెను

మనసున అతడేమో మరులుగొలిపేను 

ముడిచిన శిరోజాల మల్లెలమాలా

విడిగిన పెదవులలో చిరునవ్వువిరులు

నిగిడిన నాసికలో అదరుబెణుకులూ

విరిసిన కన్నులలో కాంతి రేఖలూ

కలసిన మనోహరుని తీపిగురుతులే 

కదలిన కరముల్లో గలగలగాజులు

ఎగసిన హృదయంలో అలజడి ఊసులు

శ్రవణము ఊయలూగు జూకాలడోల

అరుణపు వర్ణమైన బూరెలబుగ్గలు

మనసున చెలికానికి వలపుముడుపులే


Rate this content
Log in