Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ravi Sarma

Abstract

4.3  

Ravi Sarma

Abstract

పెళ్ళాం ఊరెళితే ..!

పెళ్ళాం ఊరెళితే ..!

1 min
263


పెళ్ళానికి ఊరెళ్ళాలని సరదా .

ఏడడుగులు వేసి వచ్చే ఆమెకి మెట్టినిల్లే సొంతం కదా !


తల్లిదండ్రులను చూడాలనే ఎంత దూరమైనా .

పాశ్చాత్యులకైనా రంగు వేరైతే మమకారం మారునా ?


సెలవుల్లో పిల్లలతో వస్తే ఎంత ముచ్చట ?

అదే ఎక్కడ చూసినా మనకు అలవాటట .


వేడుకలు , ఉత్సవాల్లోనూ అందుకునే ఆహ్వానం .

అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరి ప్రమేయం .


స్నేహితులతో , బంధువులతో బోలెడు కబుర్లు .

ఇంకా విహారానికి , వినోదానికి దగ్గరి ఊర్లు .


ఆడపడుచులకు అదో అనందాన్నిచ్చే అనుభూతి .

భర్తలకు దాదాపుగా కాదనలేనిది ఆ వినతి .


వారు విధేయతతో స్వయంగా విచ్చేయుటయో ,

లేదా నిర్ణయం స్వేచ్ఛగా సాగనంపుటయో .


వర్ణనాతీతం , క్రమం తప్పే ఆహారపానీయాలు .

విరహంతో వేగే ఊహాల ఉయ్యాలలు , జంపాలలు .

*** *** ***


Rate this content
Log in