పడవ కదా
పడవ కదా
పరుగుతీయు నీలిమబ్బు.. మెఱుపుపూల పడవ కదా..!
రాలు చెమటచుక్కంటే..చినుకుపూల పడవ కదా..!
మట్టికణపు పెదవులపై..నిదురపాట మధురములే..
మొలకెత్తే గింజగుండె..మెతుకుపూల పడవ కదా..!
ఆశపడే ఆయాసం..ఎన్ని మెట్లు ఎక్కగలదు..
డబ్బు చుట్టు తిరుగుతోంది..మనసుపూల పడవ కదా..!
బడిచదువుల బాటలోన..సంచి కూలబడుతున్నదె..
ఉద్యోగపు వేటలోన..బ్రతుకుపూల పడవ కదా..!
చిరునవ్వుల మొగ్గలున్న..తీగలేవి కానరావె..
చిరాకుతో ప్రతినిముషం..మరుగుపూల పడవ కదా..!

