STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

పారిజాతం

పారిజాతం

1 min
342

ఏ దివినుంచి విరిసిందో ఈ పారిజాతం

మదిలోనే మరులు గుప్పించే నవనీతం

ఎదలో ఏరులు పారించునే ఆ పరవశం

కదిలే కమనీయం కలిగించూ అవకాశం

చిలుకే సింగారించి చీరనే సిగ్గొలికినట్లూ

పలుకే రంగరించి పల్లవులే పలికినట్లూ

ఏ దివినుంచి విరిసిందో ఈ పారిజాతం

మదిలోనే మరులు గుప్పించే నవనీతం


కనుల కాంతులే ఆకాంక్షల చామంతులే

మునుల మౌనాన్ని భంగపరిచే తంతులే

కనుల కాంతులే ఆకాంక్షల చామంతులే

మునుల మౌనాన్ని భంగపరిచే తంతులే

పూబోణిలా పులకించి పున్నమిలై వెలిగి

విరిబోణిలా వికసించి విరహాలెన్నో కలిగి

ఏ దివి నుంచి విరిసిందో ఈ పారిజాతం

మదిలోనే మరులు గుప్పించే నవనీతం

ఎదలో ఏరులు పారించునే ఆ పరవశం

కదిలే కమనీయం కలిగించూ అవకాశం


తడారని అధరాలే మరలించే హేమంతం

ఎడారిని కూడ ఒప్పించి వచ్చినే వసంతం

తడారని అధరాలే మరలించే హేమంతం

ఎడారిని కూడ ఒప్పించి వచ్చినే వసంతం

చిలుకే సింగారించగా చీరనే సిగ్గొలికినట్లూ

పలుకే రంగరించాక పల్లవులే పలికినట్లూ

ఏ దివినుంచి విరిసిందో కాని పారిజాతం

మదిలోనే మరులన్నీ గుప్పించే నవనీతం



Rate this content
Log in

Similar telugu poem from Romance