పాలపిట్ట
పాలపిట్ట
ఎక్కడుందొ..?! ఎలా ఉందొ..?! నీలి నీలి పాల పిట్ట..!!
అసలు ఎలా బ్రతుకుతుందొ..బుజ్జి బుజ్జి పాల పిట్ట..!!
ఎచట నీళ్ళు..?! ఏవి చెట్లు..?! వలసపోక తప్పదేమొ..!?
గాలి ఎలా అందుతుందొ..?! బుల్లి బుల్లి పాల పిట్ట..!!
పెరుగుతున్న కాలుష్యం..వేడి సెగలు చిమ్ముతుంటె..
సౌఖ్యమెలా పొందుతుందొ..చిట్టి చిట్టి పాల పిట్ట..!!
గూడు నిలుప ఏది కొమ్మ..?! గోడు వినే వారెవ్వరు..?!
రెక్క ఎలా కదుపుతుందొ.. చిన్ని చిన్ని పాల పిట్ట..!!
ఎటు చూడూ ఇనుప వలలే..విప్పలేని వలవలలే..!
మనకు ఎలా దక్కుతుందొ..బుడ్డి బుడ్డి పాల పిట్ట..!!
