STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ పాపా

ఓ పాపా

1 min
4



చదువుంటే తెలివి కలుగు తెలుసుకొనుము ఓ పాపా!
తెలివి కలిగి బతుకు పాట పాడుకొనుము ఓ పాపా!

చదువొక్కటె చాలదులే ధైర్యముతో మెలగవమ్మ,
సమాజమొక పాఠశాల మసలుకొనుము ఓ పాపా...!

లోకములో మంచీ, చెడు రెండె రెండు కులములుండు..
మంచియనగ మానవతే యెరుక గనుము ఓ పాపా!

విద్య యన్న వెలుగు పూల దారేమరి సాగిపొమ్ము
త్వరితగతిన శిఖరమునే చేరుకొనుము ఓ పాపా!....

అమ్మ మాట తేనె ఊట విలువలెన్నొ కలిగుండును.
అమ్మయన్న మరో బ్రహ్మ తలచుకొనుము ఓ పాపా!

నేటితరం ఆడపిల్ల అపరకాళి కావాలీ
కోటికలల హరివిల్లును కోరుకొనుము ఓ పాపా!



Rate this content
Log in

Similar telugu poem from Classics