STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆమెనవ్వు

ఆమెనవ్వు

1 min
2



ఆమె నవ్వు యుద్ధకాంక్షను నిర్వీర్యం చేసేలా,
గుండెల్ని దహించే అలజడిని చల్లబరచేలా,
యుగాల శత్రుత్వానికి చరమగీతం పాడేలా,
ఎడారిలాంటి జీవితాన్ని నందన వనంగా మార్చదూ!

ఆమె దరహాసం కుట్ర కుతంత్రాల స్వరూపాన్ని భగ్నం చేసేలా,
బీడు వారిన భూసారానికి జీవం చేకూర్చేలా,
కరుడు కట్టిన కసాయిగుండెలో జాలిని పుట్టించేలా,
యదార్ధంలో దశాబ్దాల వేదనల్ని సైతం సంతోషంగా మలచదూ!

ఆమె మందహాసం హృదిలో పేరుకుపోయిన రాక్షసత్వాన్ని కరిగించేలా,
భారమై కదలలేనిమనసు కేంద్రంలో స్పందనల్ని మిగిల్చేలా,
గతకాలపు అనుభవాల చేదు జ్ఞాపకాల్ని తుడిచేలా,
మండుతున్న జీవితాల్ని ప్రేమజలంతో చల్లార్చదూ!

అగాధంలో కూరుకుపోయిన మనసుకు ఆమె నవ్వే ఓ దివ్య ఔషధం,
కలహాల ఊబిలో నిలువునా మునిగిన వారికి ఆమే ఆశలసౌధం

సంగ్రామాల్లో సైతం శాంతిగీతాల్ని వినిపించే సాహిత్యజగం ఆమెస్నేహం..
ఆర్తనాదాల స్వరాల్లో అనుకూల భావోద్వేగరాగాల్ని నేర్పించే సంగీతం,
జీవితంలో ఒక్కసారయినా ఆస్వాదించగలిగే దివ్యామృత ఆర్ద్రతా ఫలం.

ఆమె చిరునవ్వులు చిలికిన తేనెరసాల జీవిత మాధుర్యసౌందర్యం,
కవనమై మనసు జాడల్లో ప్రసన్నతను నింపేస్తుంది,
గాఢచెలిమి తేజాన్ని సున్నితంగా ప్రసరింపజేస్తుంది.

          


Rate this content
Log in

Similar telugu poem from Classics