STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ నేస్తం

ఓ నేస్తం

1 min
0

పాత జ్ఞాపకాల పుట్ట.. మనసంటే.. ఓ నేస్తం..!

తీపి వలపు పండ్ల బుట్ట..బ్రతుకంటే..ఓ నేస్తం..!


కలలన్నీ నీ భయాలు ఇష్టాలకు బింబాలే..!

జన్మ సుడుల తేనె తుట్ట..జగమంటే ఓ నేస్తం..!


బడికి గుడికి పరుగులిడగ తెలిసేనా ముక్తియనగ..?!

విడివడు'నా పాము చుట్ట..అహమంటే ఓ నేస్తం..!?


తపముసేయ తగిన శక్తి ఎట్టులబ్బు నీ తెలివికి..!?

ఏమున్నది'నాది' యనుచు ముట్ట.. సుఖమంటే ఓ నేస్తం..!


వసంతాలు పరిమళించు కాలవీణ రాగాలకు..!

చిరుగు బట్ట చూడు కుట్ట..కల'లంటే ఓ నేస్తం..!



Rate this content
Log in

Similar telugu poem from Romance