ఓ మనసా...
ఓ మనసా...
పలకరిద్దామంటే...
పనిలో ఉన్నావేమోని మొహమాటం...
కలవరిస్తూంటే...
పొలమారుతుందేమో అని భయం...
తపన పడుతుంటే...
నిదుర చెదురుతుందని అనుమానం...
అయినా కానీ...
పలకరింపుల పడవలో సాగేను
కలవరింతల కలలో తేలియాడేను...
తలపుల తపనలో పడి మునిగేను...
నీవేమో మౌనిలా చిత్రం చూస్తున్నావు...
తగునా నీకిది నేస్తమా...
నీకై నే లేనా ప్రియా...
నాకంటూ నీవేగా హృదయమా.
నేనంటూ నీవేలే మనసా...

