STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ మనసా

ఓ మనసా

1 min
109


నను మన్నించవే ఓ మనసా

నిను స్వేచ్ఛగా ఎదగ నివ్వలేదు 

రెక్కలు తెగిన పక్షిలా ఎగర నివ్వలేదు ...


నను క్షమించవే మనసా..!!

మనసారా నవ్వ నివ్వలేను...

తనివితీరా విహారించ నివ్వలేను..


నను శపించకే ఓ మనసా..!!

సాంప్రదాయ సంకెళ్లు తో నిను కట్టి పడేసి..

హుందాతనం అనే వస్త్రం తో కప్పేసి...

పిరికితనం అనే మందు పోసి

చిలిపితనం కాలరాశానని...


నను శిక్షించకే మనసా...!!

లోలోన అనగ త్రోకానని 

కుక్కిన పేను లా ఓ మూల కుక్కానని 

 నిలువునా బందించానని

బరువుగా పెంచానని...

నను విసుక్కోకే ఓ నా మనసా...!!


ఈ జన్మకు నను క్షమించు

మరుజన్మకు నచ్చినట్టు జీవించు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance