STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ మనసా 💟💟

ఓ మనసా 💟💟

1 min
5

కలతచెంది రచ్చచేస్తె ఒప్పుకోను ఓ మనసా

కలహానికి కాలుదువ్వ ఒప్పుకోను ఓ మనసా


అలవికాని ఆశలతో యుద్దాలే చేస్తావూ

ఆటవిడుపు ఓదార్పులు పూనుకోను ఓ మనసా


మధువుకోరు మధుపమువలె నిలకడలేక తిరుగుతావు 

 ఆకర్షణల అలజడిలొ చిక్కబోను ఓ మనసా 


ఊహలజడి ఊయలలో పగటి కలలు కంటావూ

కల్లల గాలిమేడలు కట్టబోను ఓ మనసా 


తాడులేని బొంగరమే నీ చలనము ఉరవడులూ

పరుగులెత్తి పాయసాలు తాగబోను ఓ మనసా


కోర్కెల చిట్ట పడగవిప్పి బుసలెన్నో కొడతావు

విషవలయపు దారులలో నడవబోను ఓ మనసా


ఊరించే వాంఛల మధు వనాలలో నీ నడకలు 

అందని ఆ ద్రాక్షరుచులు కోరబోను ఓ మనసా 


గగనంలో తారకలను చేరాలని నీ పయనం

గాలిపటం పట్టుకొనీ ఎగరబోను ఓ మనసా


ఉవ్వెత్తున ఎగసిపడే కెరటానిది తిరొగమనమె

శాంతచిత్త మధురవళిని వీడబోను ఓ మనసా


      


Rate this content
Log in

Similar telugu poem from Romance