STORYMIRROR

Midhun babu

Romance Fantasy Inspirational

4  

Midhun babu

Romance Fantasy Inspirational

ఓ మగువా

ఓ మగువా

1 min
8


ఒకరికొకరు తోడు ఉండాలని స్త్రీపురుషుల

అపురూప కలయికను బ్రహ్మముడితో

బంధం కలిపాడు విధాత

ఆ కాపురంలో మరో ఆకృతినిచ్చేదే అతివా


కానీ

అనాదిగా స్త్రీ కి జరుగుతున్నది ఏమిటీ?


దేవుడైన రాముడే ఎవరిమాటనో నమ్మి

నిండు గర్భిణిని అడవి పాలు చేసాడు

శీలవతి సీతమ్మ శిరాసావహించిందే

గాని నోరువిప్పి ఇది దారుణం అనలేదు

 

ఐదుగురు భర్తలున్న ద్రౌపదిని జూదంలో

పందెం కాసినా,జుట్టుపట్టి ఈడ్చుకొచ్చినా

నిండు సభలో వస్త్రాపహారణకు గురైన

ఏ ఒక్క భర్తను ఇదేమన్యాయమని ప్రశ్నించలేదు


సత్యహరించంద్రుడని అనిపించుకోవటానికి

కీర్తి కాంక్షతో ఆలి చద్రమతిని వీధివీధి

తిప్పిఅమ్మిన నన్ను అమ్మడానికి

నీకేం హక్కుందని నిలదీసి అడగలేదు

పతి మాటకు తలవంచి

అమ్ముడయిందే కానీ నోరువిప్పలేదు


సతీ సహగమనం పేరుతో సజీవంగా కాల్చినా..

కన్యాశుల్కం పేరుతో కన్నెలనే అమ్మినా..

బాల్య వివాహలతో వింతంతువులుగా మిగిల్చినా..

జీవితాన్ని నష్టపోయింది నారీమణి


తరతరాలుగా తరుణిని అన్యాయానికి

తాకట్టు పెడుతునే ఉన్నారు

ఇన్ని చేసినా ఇంతి ఓరిమితో సహించింది

కన్నీళ్లతో భరించింది...

సతికి స్వాతంత్యం వచ్చేదెప్పుడు?

బ్రహ్మ రాసిన రాతలో భర్తలో సగభాగం అయ్యేదెప్పుడు?

భార్యాభర్తల తులభారం సమంగా తూగేదెప్పుడు?


           


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance