ఓ మేఘం
ఓ మేఘం
ఓ మేఘం మౌనమైతే
మరో మేఘం కూడా మౌనమే
స్వచ్ఛమైన మదితో
రెండూ వెండిమబ్బులే..
శాంతం మూర్తీభవించిన మునిపుంగవులే!!
మదిలో స్పర్థలు చేరిన మేఘాలు
నలుపెక్కిన కారుమబ్బులే..
చురకత్తుల్లాంటి వాడి చూపులలో
మెరిసేను 'మెరుపులు'
గళాన ఢమరుకాలు మ్రోగి
గొంతుకలు పెడబొబ్బల్ని పెట్టేవేళ
వినిపించేను 'ఉరుములు'
పంతాలు అంతాల అంచుకు చేరి
హృదయాలు భగ్నమైన వేళ
బంధాల్ని భస్మం చేసెను 'పిడుగులు'
పతనమైన అనుబంధాల రోదనే 'వాన'

