ఓ చెల్లి మామ..
ఓ చెల్లి మామ..
ఆహ్లాదపు మబ్బులలో
హరివిల్లునై నిలిచి
చల్లని వెన్నెల తో
చెలమే చేశా....
చిగురించే తను నవ్వులలో
చిత్రాన్నై నిలిచి
అందమైన ఆశలతో
కవితనై మురిసా....
మోహన రాగాలాపనలో
మైమరచే మనసుతో
సున్నిత భావాలలో
బరువెక్కే తలపులతో....
తిమిరాల తరిమే వెన్నెలరాయుడు
మమతతో మోయలేని..
కాంతి భారాన్ని జారవిడిచినేమో
తన రూపాన మిము నాకు....
ఎదురు చూపుల్లోనే
రేయి తెల్లారనీయక
మనసులోని పిలుపులన్ని
పెదవంచున దాచలేని....
చిరుసిగ్గులతో మురియు
కలువభామ చెక్కిలి కని..
జాగుచేయక చేర
రావా ఓ చల్ల మామ....
... సిరి ✍️❤️

