ఒంటరి తీరంలో నేను
ఒంటరి తీరంలో నేను
జంటగా ఎగిరే గువ్వల జంట వెక్కిరింతగాచూస్తున్నాయ్
ఎగిసిపడే అల తెల్లని స్వచ్ఛతలో నీ స్నేహాన్ని చూస్తున్నాను.
అంతలో తడిపి ఇంతలో మాయమయ్యే ఆ జడిలో
నీ ప్రేమ వురవడి కనిపిస్తోంది!
చిత్రంగా ఆ హోరులో నీ పేరు వినిపిస్తోందిలోకంలోని
మరే శబ్దమూ నా చెవికి చేరడం లేదు పిడత కింద
పప్పువాడు నోరు కదుపుతున్నాడు!
ఓ అమ్మాయి అబ్బాయి పెదవులు కదుపుకుంటూ
నిశబ్దంగా పోతున్నారు!
పిల్లలు పరుగులు పెట్టి గవ్వలు ఏరుకుంటున్నారు!
నేనేమో నీ జ్ఞాపకాల్ని!
ఓ వృద్ధుడు తదేకంగా సముద్రాన్ని చూస్తున్నాడు.
అతడి నుదుటి మీది చారికలు అతను అనుభవించిన
జీవిత పర్వాల్ని సూచిస్తున్నాయి!
ఇప్పుడు కదులుతున్న నా చేతివేళ్ళు మన భవిష్యత్తుకై
కలల గూలు, కడ్తున్నాయి!
జీవితంలో నడి సంద్రంలో ప్రయాణిస్తున్న ఓ నడివయసు
జంట రేపు అనే కాయితం మీద లెక్కలు వేస్తూ ఈ వేల్టి
కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్నారు!
పసిపిల్లలకి అమ్మానాన్నలు, ముసలాయనకి కర్ర ఊత,
ప్రేమికులు ఒకరికొకరు, భార్యాభర్తలకి బాధ్యతల బంధానాలు
అందరికీ వెనక్కి వెళ్ళడానికి సాధానాలున్నాయి!
నేను ఎలా వెళ్ళను? అందుకే కూర్చునే వున్నాను ఇలా
తీరంలో ఒంటరిగా!

