STORYMIRROR

ARJUNAIAH NARRA

Fantasy

4  

ARJUNAIAH NARRA

Fantasy

ఒంటరి మనస్సు

ఒంటరి మనస్సు

1 min
698

నా ఒంటరి మనస్సు నా మాట విననంటోంది

నీ ఘాటైన ఓదార్పు కోసం ఎదురు చూస్తుందని 

నీకు తెలియదా! 

తడి ఆరని నా కనుపాపలు

నీ చిరునామానే గుర్తు పెట్టుకున్నాయి

నీవు దూరమైతే మళ్ళీ 

ఆ కన్నీటి చినుకులు నాకు దగ్గరవుతాయి

నీవు దరి చేరితే నా కన్నీళ్లు దూరమవుతాయి

అడుగంటిపోతున్న నా ఆశలకు ఊపిరిలుదావు

నీ స్పర్శతో నాలో చిరునవ్వులు

మళ్ళీ మొలకెత్తుతున్నాయి

నీ ఆలోచనలతో నా మనసుకు 

ఊపిరి ఆడటం లేదు

ఏంటి నీ అరాచకం!

ప్రాయం పరువళ్లు తొక్కుతున్నది

చేసే ప్రతిపనీ కొత్తగానూ అద్భతంగానూ ఉంది


పిచ్చెక్కిస్తున్న నీ ఊసులు 

ఊరిస్తున్న నా లేత బుగ్గలల్లో 

సిగ్గులను చిందిస్తున్నవి

కండలు తిరిగిన నీ చేతులు

కవ్విస్తున్న నా నడుము ఒంపులను సరిచేయాలంటున్నవి

ఉడికిస్తున్న నీ దొర పెదవులు

నా అధరాలను అందుకోవాలని 

ఆరాట పడుతున్నవి

ఎక్కుపెట్టిన నీ చూపులు నా సోయగాలకు 

తియ్యని తీపి గుర్తులుగా గాట్లు పెడుతున్నవి


అందుకే హాయిగా ఉండాలని....

వెన్నెలని రాత్రీ నా మేనికి పూసుకున్నాను

నా దేహమంత పాలకోవాల మారింది

రుచి చూడనిదే దేని విలువైనా ఎలా తెలుస్తుంది

అనుభవించనిదే ఏ జ్ఞాపకమైన కనుమరుగవ్వదా

మోయలేని నా సొగసులకు సున్నితంగా

నీ విరహం జ్వలిస్తు నన్ను రగిలిస్తు

నేను నీలో చేరి ఒకరిలో ఒకరం 

శాశ్వతంగా కల్సిపోయి కరిగిపోయి

అనంత ప్రేమజీవనదిలా ప్రవహిద్దాం

అంటూ మారం చేస్తోంది...



Rate this content
Log in

Similar telugu poem from Fantasy