STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నయన సోయగం

నయన సోయగం

1 min
158


నయనాలా అవి...నయగారాలా

కనులవిరిసిన కలువ సొగసులా

కనురెప్పల కదలికల కవ్వింతలే

కదిలెడి మీనముల తుళ్ళింతలే


తళుకుబెలుకు తాళములేయవి

తరుణీమణీ తలపులదర్పణమే

చూపులతూపుల దాపుల చేరగ

నిలవనీయదే మరిగాలంవేయగ


నయనమనోహరీ నక్షత్రకాంతులే

నీ కంట... మెరిసి మురిసెనా మరి

కనుదోయి పూదోట కదలే కావ్యమై

కలికి కన్నుల వన్నెలువిరిశరములై


మగువమోమున నతి ప్రియములే

మధువనిలో మకరందచందములే

మదినిదోచెడి మధుపాత్రలా యవి

ఎదలయలు గతి తప్పునేఅభినేత్రీ!


సునయనీ! సుందర వీక్షణతూణీర

సుమధుర మౌనభాష భావనాఝరి

పలుకులేల మదికి ప్రణయరసమే

తొనకిసలాడ తొలివలపు తోటలో!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance