నవ్వుకో
నవ్వుకో
బంగారు సంకెళ్ళు..రాలగా నవ్వుకో..!
సుదరిశన చక్రాన..తేరగా నవ్వుకో..!
అందాల లోకమిది..గంధాల వనమేను..
నిజప్రేమ కావ్యముగ..మిగలగా నవ్వుకో..!
అద్దాల మేడ ఇది..దివ్య మధుశాలయే..
నిజదీప సాక్షిగా..నుండగా నవ్వుకో..!
కాగితపు పడవలో..పయనమిది నేస్తమా..
నీ నేను కడలియే..దాటగా నవ్వుకో..!
పొగడినా తెగడినా..ఏముంది మాటలే..
మౌనమను నిధి'లోన..చేరగా నవ్వుకో..!
రుధిరమది మరిగెనా..ప్రాణాలు మరుగునే..
కోపాల పాలెల్ల..మరగగా నవ్వుకో..
