నీ మౌనపు
నీ మౌనపు
యుగాలుగా ఎదురుచూపు..నీతోనే కలవాలని..!
కన్నులార ఒక్కసారి..అలా నిన్ను చూడాలని..!
మరో కోరికేం లేదు..అని ఎలా చెప్పగలను..
చిట్టచివరి కోరికిదే..నీ పదముల వాలాలని..!
ఆశపడే ఈ మనస్సు..ఉందెచటో తెలియలేదు..
ఈ ఊపిరి ఆగులోపు..దాన్ని నీకు ఇవ్వాలని..!
మరుగుతున్న తపనేదో ..ఎలా నిలువరించాలో..
నాలోనే ఉన్న నిన్ను..ఒక్క మాట అడగాలని..!
అంత వెర్రి నీకెందుకు..అన్నా సరె ఆగలేను..
ఎలాగైన నీ మౌనపు..నిధినిచేరి ఉండాలని..!
నా తెలియని అలజడికో..అర్థమేమి ఉండేనో..
ఘనీభూత ఛాందసాల..చరిత్రగతి మార్చాలని..
