మీకు చెడు చేయాలనుంటే.
మేము మంచి చేసి చూపుతాం.
మీదగ్గర ఆయుధాలంటే.
మాదగ్గర పాదరసం లాంటి ఆలోచనలున్నాయి.
మీకు కోపాలుంటే
మాకు ఓపిక సహనాలున్నాయి.
మీకు బిగ్గరగా అరవడం తెలిస్తే.
మాకు మౌనం వహించడం తెలుసు.
మీకు ఎత్తులు వేయడం తెలిస్తే.
మాకు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు.
మీరు యుద్ధం చేసి ప్రాణాలు తీస్తే.
ఆప్రాణాలను కాపాడుకుంటాం.
మీరు ఎత్తులు వేస్తే.
మేము వాటికి పైఎత్తులు వేస్తాం.
మీరు ఓడిస్తే.
మేము గెలిచి చూపుతాం గొప్పగా.
మీకుతెలిసేలా తగిన రీతిలో బుద్ధిచెబుతాం.
అన్ని సాధించి చూపెడుతాం మీకు..