నువ్వు..
నువ్వు..
తడికురులు అరబెట్టుకుంటూ
సడిచెయ్యక అడుగులువేస్తూ
వడివడిగా నీకై వస్తూ
అతి చనువే నీకే యిస్తూ
మతిచెడి నేనే వుంటూ
తికమకలో పడిపోతున్నా
ఇదేమి వింతమోహమో
మరి మాయరోగమో కన్నా...
ఎన్ని కోపతాపాలున్నా
నీ పిలుపుతో మాయం
ఎంత అలక వున్నా
నీ నవ్వుతో వేస్తావు గేలం
చిన్నిచిన్ని గొడవలున్నా
చల్లగ పూస్తావు చందనం
పెద్దపెద్ద యుద్ధాలున్నా
దండయాత్రతో గెలుస్తావు నా హృదయం
మాయలోడివి రా నువ్వు మాటకారి...
...సిరి✍️❤️

