నువ్వు
నువ్వు
మరిచిపోయాను అని అనుకుంటూనే
మళ్ళీ మళ్ళీ గుర్తుకువస్తుంటే
ఏ జన్మ రుణమో
ఏ జన్మ బంధమో
అని అనుమానంగా ఆలోచిస్తున్నా
అడగాలని అనుకున్నా కాని
వినడానికి నేను ఉన్నా
చెప్పడానికి నువ్వు లేవని
మళ్ళీ గుర్తుకువచ్చి మౌనంగా ఉండిపోతున్నా
కనిపించని లోకంలో నువ్వు
వేదన కనిపించకుండా లోకానికి దాస్తు నేను

