నువ్వు -నేను
నువ్వు -నేను
సాగర గాంభీర్యం నీదైతే...
కనిపెట్టుకుని ఉండే తపన ఆగని తీరం తీరు నాది...
కనబడని కడలి కల్లోలం నీవైతే...
కనిపించే కెరటాల కేరింత నేను ...
మౌనమైన సంద్రాన్ని చూసావా ఎప్పుడైనా...
నా కను పాపలో ప్రతిబింబం చూడు అగుపడుతుంది...
సముద్రాన్ని చూస్తూ సమయం మరచినట్టే...
నిన్ను చూస్తున్నా ఎంతకూ తనివి తీరదే ...
ఆదమరుపుగా నిను చూస్తూ అంబుధిలో విలీనమై ...
కనుమరుగయ్యే నదినై నీలో కలిసి పోయానేమో కదా...
అస్థిత్వం కోల్పోయాననే దిగులే లేదు...
అలల అల్లరి అలరింపు నాదేగా మరి...

