నువ్వే
నువ్వే
ప్రతి ఉదయం నీ జ్ఞాపకం
నా మనసుని తట్టిలేపే
ఒక అద్భుతమైన భావనైతే.......
నీ చిరు సందేశం
నా పెదవులపై నవ్వులకు
చెరిగిపోని చిరునామా..........
నీ పరిచయంలో ఎన్ని వింతలో
నీ సహవాసంలో ఎన్ని విశేషాలో
మౌనం పలికే తొలి మాట నువ్వే
ఆశలు విరిసే పూలతోట నువ్వే
తలపులు పాడే శ్రావ్యమైన పాట నువ్వే
ఊసులు ఆడే అద్భుతమైన ఆట నువ్వే
తియ్యని పూల మకరందం నువ్వే
చల్లని మంచు శిఖరం నువ్వే
వెచ్చని ఉషోదయ కిరణం నువ్వే
పచ్చని పైరగాలి పరిమళం నువ్వే
నా కనులకి అందం నువ్వే
నా మనసుకి ఆనందం నువ్వే
నువ్వు నేనుగా , నేను నువ్వుగా
మన ఇద్దరం ఒక్కటేగా...
... సిరి ✍️❤️

