STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

నువ్వే నేను

నువ్వే నేను

1 min
327

ఆ మెత్తని నల్లని రాత్రి 

మినుకు మినుకు మంటున్న 

చిన్నారి తారలు 

దారి చూపించే 

ప్రయత్నం చేస్తున్నాయి 

హోరెత్తుతూన్న సముద్రపు అలలు 

జోలపాడుతూ జోకొడుతున్నాయి 

ఒత్తైన పచ్చని గడ్డి పానుపు మీద 

పడుకుని ఉన్న నాలో 

ఎలాంటి భావాలూ పలకటం లేదు 

చుట్టూ ఉన్న ప్రపంచం లాగే 

స్వచ్ఛమైన నిశ్శబ్దం 

గంటలు గడుస్తూన్న కొద్దీ 

నాలో ఒక్కటే అలజడి 

నువ్వూ నేనూ ఒకటేనా 

లేక ప్రపంచం అనుకుంటున్నట్టు 

వేరే వేరేనా 

మనిద్దరం వేరైతే 

నువ్వు లేని ఈ క్షణాలు 

నాలో దుర్భర 

వియోగ బాధను రేగించాలికదా 

కానీ నాలో ఈ ప్రశాంతత 

ఎలాకలుగుతోంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract