నునుసిగ్గుల లేత మొగ్గ
నునుసిగ్గుల లేత మొగ్గ

1 min

23.8K
నా హృదయ వినీలాకాశం లో
వెలిగే అందాల తారకా
పులకించునోయి మేను
నీ తలపుతో
పరవశించు నోయి హృది
మన కలయికతో
తెల్లటి మంచు బిందువువై
స్వచ్ఛమైన మనసుతో
రావోయి ఓ నాటి రేయి
ఆగాగు
అప్పుడే కాదు
ఇంకా నే బాలను
నును సిగ్గుల లేత మొగ్గను
ఇప్పుడే అయితే
నిలువ లేవు
జారిపోతావు
మత్తెక్కించే పరిమళాలతో
కైపెక్కించే మకరందాలతో
ఓ సుప్రభాతాన
అందంగా విరుస్తాను
అప్పుడు
సువాసనల మధ్య
తియ్యందనాలలో
కరుగుదువుగాని
నీ వికసిత కుసుమాన్ని
పులకింప చేద్దువుగాని