నటీంచాలి
నటీంచాలి
జీవితమనే నాటకంలో
మనమందరం నటిస్తున్న పాత్రధారులo
ఒక్కో అవసరానికి ఒక్కో పాత్ర
ఒక్కో రంగు పూసుకొని
ఒక్కో ముసుగు వేసుకొని
నటిస్తూ,ఆ నటనలో అదే
జీవితం అన్నంతగా జీవిస్తాము
ఆ నటనతో ఎదుటి వారినీ
నవ్విస్తున్నామా,ఏడిపిస్తున్నామా
సంతోష ఆనంద లోకాల్లో ముంచుతున్నామా
ఆన్న సంగతికొస్తే.....
పాపాయి పాలు తాగకపోతే ఒకనటన
బుచాడిని చూపి భయ పెడుతూ నటిస్తూ తాపిస్తాం
లేకపోతే పాలు తాగక పోగా అల్లరి చేస్తుంది
మనలో బాధలేకపోయినా ఎదుటి వారికి తెలియజేసేందుకు నటిస్తాం
రాని ఏడుపునుతెచ్చుకొని
లేనినవ్వు వచ్చినట్టుగా
అబద్దానికి అంద మైన కలరేసీ
అతిశయొక్తుల నిచ్చెన మెట్ల పై
మనల్ని నిలబెట్టి
నటించే నవరస నటనా సార్వభౌములు
మనం నమ్మితే మనపక్కలోనే కాపు కాసి ఉంటారు
బతుకుపోరాటంలోఅవసరానికో అబద్దం,
అడుగడుగు కో అందమైన నటనతో చలిస్తుంటాం
లేకపోతే జీవితమనే నాటక రంగం లోముందుకు పోలేము
