నను చేరేనే
నను చేరేనే
నను చేరెను గాలికబురు...తీరానే ఉన్నావని
మది సందడి చేసిందే .......భారాన్నే తీర్చావని...
ఎన్నాళ్ళో ఎదురుచూపు..కనురెప్పలు అలసిపోయె
కలువలన్ని అలిగిపోయె...చంద్రడినే కన్నావని
గాయమైన గురుతులేవొ..... ఙ్ఞాపకాల సంద్రంలో...
కఠినమైన శిలనైతిని......దూరాన్నే. పెంచాలని..
శ్రావ్యమైన గాత్రంతో.....హృది గీతం పాడుకున్న...
కలతచెంద ..అపస్వరము ....రాగాన్నే విన్నావని...
విరహాగ్నే పొగమంచుగ......గుడ్డివాడి నైనపుడూ
నేను వచ్చు దారిలోన....జాడల్నే ఉంచావని....
నీ శ్వాసల నిస్వనమే .. నను చేరే మంత్రమికా...
పెను భారము శ్యామా....ఇది..నిన్నే చూడాలని...
తీరాన్నే చేరలేక ...తనువు చేసె, తపసెంతో....
వరంగాను నీ ప్రేమను....పూవుల్నే పరిచావని....

