STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

నందినైపోతాను

నందినైపోతాను

1 min
358

అదేందో మరి

అట్టా నీ పేరింటే సాలు శివా

ఒళ్లు మరిసిపోతాను

బాధల్ని దూరం జరుపుతాను


అదేందో మరి

నీ గుడి సూస్తే సాలు 

పిల్లాడు అమ్మ దగ్గరికి పరిగెత్తినట్లు 

నేను నీ దగ్గరికి పరిగెత్తుతాను


శ్రావణంలో నీకు అభిషేకమవుతాను

కార్తీకంలో నీ గుడి దీపమౌతాను

నీ భక్తుల చేతుల్లో మారేడునవుతాను

నువ్వు ఊ అను సామీ

నేను నందినైపోతాను

ఆనక నీలో ఐక్యమైపోతాను.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract