నమ్ముటెట్లా
నమ్ముటెట్లా
మేలుచేసే కాలమేదో..ఉండునంటే నమ్ముటెట్లా..!
పుట్టబోయే ఆడపిల్లే..దక్కునంటే నమ్ముటెట్లా..!
ఊయలైనా ఊహలైనా..కావ్యగానం కోసమేలే..
కాకికూడా కోకిలల్లే..పాడునంటే నమ్ముటెట్లా..!
రాగమైనా తాళమైనా..శ్వాసనంటే పొంగుతాయే..
విద్యలేవో నేర్వకుండా..అబ్బునంటే నమ్ముటెట్లా..!
జన్మమర్మం బోధచేసే..మౌనదీపం సాక్షికావా..
మొగ్గలోనే రాలిపోతూ..పండునంటే నమ్ముటెట్లా..!
నీడకూడా గేలిచేస్తూ..పాఠమేదో నేర్పుతుందే..
అశ్రువేదో జారిపోతూ..నవ్వునంటే నమ్ముటెట్లా..!
పాలలోనే దాగికూడా..కాచకుండా నెయ్యిరాదే..
రైతుస్వేదం లేకఅన్నం..అందునంటే నమ్ముటెట్లా..!
