STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నిర్వేదం...

నిర్వేదం...

1 min
331

బాధా రాహిత్యపు బంధమై ఆనంద రాహిత్యపు అంచులలో

నా మది పాడిందొక వేదం ఆ వేదానికి నిర్వేదమని పేరు

నిర్వేదపు గీతానికి నిరాశ నెచ్చెలి అట ఆశ శత్రువట,

ఇదేమి, నేను నిర్వేదానికి శత్రువుని కదా

అజాతశత్రువు ఆశ నా సేనాధిపతి అయిననూ నిర్వేదపు గీతానికి తైతక్కలేల

అంతలో నవ్వెను నా చెలి “ ఏకాగ్రచిత్తము “ అంత కనిపించె సత్యము

నే పాడుతున్నది నిర్వేదపు గీతము కాదు అది ఆశయ గీతమే, ఆ గీతమున తగ్గినది నా చెలి గొంతే నేనున్నది బాధ చేరని, ఆనందము కదిలించలేని

 ఆశయ సాధనలో నా చెలి చెంతనుండ పొందలేనిదేమి...


Rate this content
Log in

Similar telugu poem from Romance