STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Classics

4  

Venkata Rama Seshu Nandagiri

Classics

నిరీక్షణ

నిరీక్షణ

1 min
336

స్వామీ, అని ఆర్తిగా పిలిచాను, నీవస్తావనే ఆశతో,

నీవీనులకు, నేనెంత పిలిచినా వినరాలేదేలనో,

ఆడుచుంటివేమో గోపెమ్మలతోనో, గోపబాలురతోనో,

రాధమ్మ వలపు మధువు గ్రోలుచూ, నను.మరిచితివో.

నా స్వామీ! కనులు ఎదురు చూస్తున్నాయి నీ రాకకై,

తడియారని నా చీకటి కళ్ళు, కన్నీటి కాసారాలై,

ఊహిస్తున్నాయి నీరూపును మనసున. ముద్రించుటకై,

నా కనులకు కానరాకున్నది నీ రూపు, నే వీక్షించుటకై.

నాథా! నీకై వేచి వేచి నా తనువు అలసి సొలసింది,

ఎంత వేచినా గడవని సమయం కలవరపెడుతోంది,

నీవొస్తావని, కరుణిస్తావని మది ఆరాట పడుతోంది,

ఎంత కాలమైనా, నీ సన్నిధిలోనే నే ఊరట చెందేది.

కనుగొనగలనా నిను, శిల్పకారుడు చేసిన ప్రతిమలో,

శుచి స్నాతనై, తడి మేను తో, తడిసిన వస్త్రములలో,

ప్రతిమను ఆశగా తడిమేను, ప్రతిష్టించుటకు మదిలో,

అణువణువూ నాచేతితో స్పృశించా తన్మయత్వంలో.

నా అంతర్నేత్రంతో కనుగొన్నా, ప్రతిమలోనున్న నిను,

బాహ్యచక్షువులే లేని నేను, ప్రతిమలో దర్శించా నిను,

నీకు నాపై గల కరుణార్ద్రదృష్టికి ఏమని పొగడగలను,

ధన్యురాలనైతిని ఈ జన్మకు, నీ కృపను పొంది నేను.


Rate this content
Log in

Similar telugu poem from Classics