నిరీక్షణ
నిరీక్షణ
ఆకాశవనంలో పూసిన జాబిల్లి
నీకై రానా ఐరావతం ఎక్కి
అంతరిక్ష వీధిలో మెరిసే తారక
నీకోసం రానా పుష్పకవిమానమెక్కి
కలలసౌదంలో మెదిలే సుందరి
నీకై ఎగిరి రానా రెక్కల గుర్రమెక్కి
మధువనంలో విరిసిన ఓ మకరందమా
ఝుమ్మని నీపై వాలన తేనెటీగనై
భూతల స్వర్గంలో విహరించే దేవకన్య
భువినే కానుకివ్వనా నీ అందచందాలకి
క్షీరసాగర మథనంలో జనించిన ఓ ఊర్వశి
నీకై రానా స్వయంవరంలో గెలిచి
హాలహాలం తాగి ఓ చెలి
మరణించి మళ్ళీ రానా నీకై యముడిని అణిచి
మధుర జ్ఞాపకమై నిలిచే మన ప్రేమకు
మరో షాజహానైనే తాజమహలే కట్టనా
నీకై చేయనా ప్రపంచ జైత్రయాత్ర
నీకోసం రాయన మరో లైలా మజ్ను చరిత్ర
చెలి కోసం ఆరాటమే నా పోరాటం
తన సావాసం కోసమే ఈ నా సహనం.