నిప్పుడు...
నిప్పుడు...
ఐనా
మెదలెట్టనా?
మొదలెట్టానా?
మసక బారిన శరీరాల
మల్లయుద్ధం లా ఉంది
ఈ గదుల్లో
రూపం మార్చుకుంటూ
నాట్యం చేస్తూ
బాధ తీవ్రం
ఆలింగనం ఉపశమనం
మెదలెట్టనా?
ఎలా?
వెన్నుపోటు పొడుచుకుని
బాకును మ్రింగివేసి
ఇక కోయడానికి వీలు లేకుండా
కడుపులోకి సురక్షితంగా నెట్టివైచి
ఎక్కడిది అంతమవును?
ఎలామొదలెట్టను?
తాళమేశా
చెవి అక్కడే మరిచా
విరిగిన బొమికకు
మంత్రమేసి అతికిస్తూ....
ఎప్పటిలాగే అదృశ్యమవుతుంది !
రుధిరం ప్రవహిస్తూంది
పారుతున్నది ప్రపంచం లోకి
ఇది ఉపశమనమా?
ఎలా మానుతుంది?
కారుతూంది బుగ్గపైన
ఉప్పగా !
రంగు ముదురుగా
చేతికి చల్లగా
నల్లని రక్తపుమరకలు పూసిన
రాత్రిని ప్రక్షాళన చేస్తూ
ఇనుప ముక్కలనూ
ఎముకల చలినీ జల్లెడ బడుతూ
పోరాటంలో మిగిలిన ద్రవాన్ని ఎండబెడుతూ
ఇప్పుడు నేను మొదలెట్టగలను
ప్రసాదరావు రామాయణం
