నిన్ను మరువను నేస్తం
నిన్ను మరువను నేస్తం
ఎలా కొలవను ఈ ప్రేమని
ఏమిచ్ఛి తీర్చగలను నువ్వు చూపిన ఈ ఆప్యాయతకి
మరుజన్మకు సరిపడా అనుభూతిని మదినిండా నింపావు
హృదయాన ఎన్నటికీ చెరగని గురుతు వేసావు
ఒక్క క్షణమైనా నిన్ను మరువను నేస్తం
కనుపాపలో నీ రూపం ఉంటుంది
నా చివరి క్షణం వరకు...

