నింగి చుక్క
నింగి చుక్క
నా మనసు ముంగిట
నువ్వు వెలిగించిన దీపం ఆరలేదు
కాపాడుతూ ఉంటాను
కడవరకూ కన్నీటి వరద రాకుండా..
నువ్వూ నేను ఏక లయగా ధ్వనించే
నా హృదయాన్ని పదిల పరుస్తాను
నిజమైన వెన్నే కదా నీ మనసు
నా కోసమే కరిగి అభిషేకమాయ్యావు
నామనసు నట్టింట్లో పండుగే మరి
చిరునవ్వే వరమైనందుకు
అరుదైన అబ్దుతం నువ్వయితే
నిన్ను చేరుకునే నింగి చుక్కను...
... సిరి ✍️❤️

