STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీవు

నీవు

1 min
10


ప్రేమగ'నే జీవించగ..నేర్పిస్తూ ఉంది నీవు..!
అమృతకరుణ నింపేస్తూ..బ్రతికిస్తూ ఉంది నీవు..!

ఎదురయ్యే బాధలెలా..ఎదురీదే బలమిచ్చునొ..
అనుభవాల పుస్తకాన్ని..చదివిస్తూ ఉంది నీవు..!

బంధాలను తెగతెంపులు..చేసుకునే పోదునెటకు..
పౌరుషాలు పంతాలను..ఇగిరిస్తూ ఉంది నీవు..!

జరుగుతున్న యుద్ధాలే..శాంతిపూల దారిచూపు..
విచక్షణను ప్రసాదముగ..తినిపిస్తూ ఉంది నీవు..!

ఆనందపు నిధినీవై..హృదిలోనే కొలువుంటివి..
మౌనగగన వీధులలో..నడిపిస్తూ ఉంది నీవు..!

నినుచూడగ పరితపించు..మనసేగా మనసంటే..
జగమంతా ఉన్న నిన్ను..చూపిస్తూ ఉంది నీవు.


Rate this content
Log in

Similar telugu poem from Classics