నీవు బాగుండాలి
నీవు బాగుండాలి
ప్రేమలో నిజాలు ఉంటేనే కాస్త పవిత్రం
మనసుకు, మమతకు అద్దేటి పరిమళం
నువ్వే నా ప్రపంచం అన్నది ఓ మంచి అర్థం
నీవు బాగుండాలి అన్న మాట నిస్వార్థం
జీవితమంతా మనతో ఉండేవారు కొందరే
అలాగే మధ్యలో వచ్చి వెళ్లేవారు మరెందరో
కానీ మన కన్నీటి వెనుక దాగిన బాధను
మాటలేకుండానే చదివేది నిజమైన ప్రేమ
బాధలో ఉన్నా, ఏం లేదు అనే ఒక మాట
ఎన్నో చెప్పలేని గాయాలు దాగిన మూట
చిరునవ్వు వెనుక కన్నీరు కనిపించిన క్షణం
అభద్రత కాదు, అది ఆత్మీయతకు పరీక్ష
కొన్ని నిజాలు మనసును కొంచెం నొప్పిస్తాయి
వాటిని దాచడం మాత్రం నిజంగా ప్రేమ కాదు
మనసు మెచ్చే మాటలు చెప్పడం మామూలు
మనిషిని నిలబెట్టే నిజమే గొప్ప అనురాగం
విజయాలు మనుషులను దగ్గర చేస్తాయి
అభద్రతతో బంధాలు నిశ్శబ్దంగా దూరం
విజయం అభద్రతల మధ్య పోరాటం కాదు
తనను తాను కోల్పోకుండా చేసే ప్రయాణం
అందుకే ప్రేమంటే కేవలం గెలవడం కాదు
మనసులోని భయాలకు ఓదార్పుగా నిలవడం
నువ్వు నా వాడివి అని చెప్పడం కూడా కాదు
ఏ పరిస్థితిలోనైనా నువ్వు బాగుండాలనడం
