STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు

నీవు

1 min
218

విశ్వప్రేమ కావ్యానికి..హృదయంలా నీవు..! 

నానేనుల భువనాలకు..అద్దంలా నీవు..! 


నా తియ్యని ఆకాంక్షల..తీరమేదొ ఏమొ.. 

ఎదలోయల అల్లుకున్న..గీతంలా నీవు..! 


అమృతమధుర భావాలకు..ఆలవాల మేదొ.. 

గగనాలను కరిగించే..తీర్థంలా నీవు..! 


లేని మనసు సృష్టించుకు..తేలిపోదు నిచట.. 

ఈతనువున కోటిదీప..నాట్యంలా నీవు..! 


కనిపించని నీరూపం..చూస్తూనే ఉందు.. 

నా ఎదురుగ నవ్వుతున్న..మౌనంలా నీవు..! 


ఆలోచన తోటలోని..ఫలములెన్నొ చూడ.. 

పానశాల పనేలేని..కలశంలా నీవు..! 


మరిమనసు తత్వానికి..వ్యాఖ్యానము లేల.. 

 ప్రాణసాక్షి దైవత్వపు..దారంలా నీవు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance