STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

నీవు వస్తావని ..!

నీవు వస్తావని ..!

1 min
462

తొలిచూపుతో నాలో కల నిజమైన భావం .

కానీ , నీ స్పందన తెలిసేవరకు ముభావం .

తెల్లని నవ్వులో మొదలు మధుర ప్రేమరసం .

ఎర్రని బుగ్గలతో చెప్పలేనంత పరవశం .


అనంతర సమయంలో నన్ను నేను మరచిపోయా .

రాబోయే నిన్ను తలచి ఊహల్లో తేలిపోయా .

నీవే నా హృదయసామ్రాజ్యానికి రాణివని వలచా .

ఇల్లే ఇలలో స్వర్గమని ఓ బొమ్మను చిత్రించా .


కాలానికి చిగురులు తొడిగే వసంతంలా

కమ్మని రాగంతో రంజింపజేసే ఆమనిలా

ఎడారిలో దాహార్తిని తీర్చే నీటి సరస్సులా

నీలాకాశంలో పున్నమి వెన్నెల జాబిలిలా

తెల్లకాగితంమీద ఒలికే అందమైన అక్షరాల్లా

నీవు నాకోసం త్వరలో వస్తావని

నా లోకంలో మరిన్ని రంగులు తెస్తావని

కనిపించి ఆశల గాలిపటాలను ఎగరేస్తావని

జంటగా సరాగాలు పలికిస్తావని

వేయికన్నులతో ఎదురుచూస్తున్నా .


*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Romance