నీవు రాక
నీవు రాక
ఈ మనస్సు బరువునెలా..దించుకోను నీవు రాక..!
ఈ చీకటి మంటనెలా..తట్టుకోను నీవు రాక..!
ఖర్జూరపు గాలికూడ..వేదననే విసిరేనా..
ఒక తియ్యని పాటనెలా..పాడుకోను నీవు రాక..!
ఒక ఒంటరి ఒంటెలాగ..ఎక్కడికో పయనమసలు..
మసలుతున్న అశ్రువెలా..నిలుపుకోను నీవు రాక..!
నీరు లేని ఒయాసిస్సు పాలైనది వసంతమే..
సొంతమైన నీడనెలా..కప్పుకోను నీవు రాక..!
పున్నమింటి వెన్నెలతో..జగడమెందు కంటావా..
గొంతుదిగని మధువునెలా..కోరుకోను నీవు రాక..!
రేయి గడవనంటున్నది..నీవు లేక మాధవుడా..
ఒలకలేని దు:ఖమెలా..ఓర్చుకోను నీవు రాక..?

