STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు లేని ప్రతి నిమిషం

నీవు లేని ప్రతి నిమిషం

1 min
7

నీవు లేని ప్రతి నిముషం నరకమల్లె తోచునులే..!!

నీ అలికిడి వినిన క్షణం స్వర్గమల్లె తోచునులే..!!


ఏ రాగము ఇవ్వదుగా.. నీ తియ్యని అనురాగం..

నీ చూపది వర్షించే మేఘమల్లె తోచునులే..!!


ఏ తాళము కురియదుగా.. నీ మౌనపు సవ్వడులను..

నీ హాసము అది చిందే వేదమల్లె తోచునులే..!!


ఏ భావము అందదుగా.. ఓ కవితగ లిఖియించగ..

నీ తలపది పొంగించే నాదమల్లె తోచునులే..!!


చిత్రమేమొ గీయలేను..మదిని ఏల.. నిండినావొ..

నీ శ్వాసది పండించే దీపమల్లె తోచునులే..!!



Rate this content
Log in

Similar telugu poem from Romance