నీవు లేకుంటే ఎడారే ..!
నీవు లేకుంటే ఎడారే ..!
నా ఊహల్లో నువ్వు ఆనాడు ఉదయించాక ,
అనుభవంలో ప్రతిరోజూ కొత్తదనమే .
ఆశలను పెంచే అద్భుతమైన ఆనందమే .
నీతో జీవితంలో ...
ఆకాశంలాంటి ఒక విశాలమైన హృదయాన్ని ప్రేమిస్తున్నా .
సెలయేరులోని గలగలలను నీ మాటల్లో వింటున్నా .
పువ్వులో కనిపించే మృదువైన దరహాసాన్ని చూస్తున్నా .
నీవు నాతో లేకుంటే ...
జీవంలేని ఎడారిని తలపించదా ప్రేమను పంచే ఆ రూపం !
ఎండమావిలా మారదా నా అందమైన కలల ప్రపంచం !
అందుకే ,
ఉండిపోవా ఎప్పుడూ నా నువ్వు ఎదురుగా కనిపిస్తూ !
నా గుండెచప్పుడుకు ప్రాణం నిరంతరం పోస్తూ !!

